నేడు జరగనున్న హర్భజన్ వివాహానికి రానున్న వీఐపీల లిస్టు, విందులో మెనూ ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు జరగనున్న హర్భజన్ వివాహానికి రానున్న వీఐపీల లిస్టు, విందులో మెనూ ఇవిగో!

క్రికెటర్ హర్భజన్ సింగ్, గీతాబస్రాల వివాహం నేడు జలంధర్ లోని కబానా రిసార్టులో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అంబానీల కుటుంబం, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, ఐపీఎల్ ముంబై టీం సభ్యుల్లో పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్, ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజా తదితర వీఐపీలు రానున్నారు. సంప్రదాయ పంజాబీ పద్ధతిలో వివాహం జరుగనుండగా, అతిథులకు వండి వడ్డించేందుకు దక్షిణాది, ఉత్తరాది వంటకాలు సిద్ధమవుతున్నాయి. దక్షిణాది అల్పాహార వంటకాలైన ఇడ్లీ, ఊతప్పం, రకరకాల దోశలు, వడ తదితరాలు వండేందుకు నిపుణులైన వంటవారిని పిలిపించుకున్నారు. విదేశీ అతిథుల కోసం లక్నో, ఢిల్లీ, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి పాకశాస్త్ర నిపుణులు ఇప్పటికే కబానాకు చేరుకున్నారు. వీరంతా తమతమ ప్రాంతాల వంటకాలను వండి వడ్డించనున్నారు. ఆహార పదార్థాల వద్దకు వెళ్లే అవసరం లేకుండా, మెనూలోని అన్ని వెరైటీలూ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ సాయంతో చుట్టూ తిరుగుతూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఫేమస్ అయిన 'పరంతేవాలీ గాలీ'ని కూడా ఆహూతులకు రుచి చూపించనున్నారు. కాగా, మంగళవారం నాడు 'సంగీత్', బుధవారం నాడు 'చూరా' ఉత్సవాల్లో కాబోయే నూతన జంట ఉత్సాహంగా పాల్గొంది.

More Telugu News