ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల జాబితాలో పాల్ వాకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల జాబితాలో పాల్ వాకర్

ప్రముఖ పత్రిక 'ఫోర్బ్స్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలతో వివిధ కేటగిరీల్లో ప్రతి ఏటా జాబితాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందులో 'ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల జాబితా' కూడా ఉంది. దాని ప్రకారం చనిపోయిన సెలబ్రిటీల ఆదాయాన్ని బట్టి జాబితాలో పేర్లు ఉంటాయి. అంటే వారు మరణించిన తరువాత కూడా కుబేరులేనన్నమాట. తాజాగా ఆ జాబితాలో రెండేళ్ల కిందట హైస్పీడ్ కారు ప్రమాదంలో మరణించిన హాలీవుడ్ స్టార్ పాల్ వాకర్ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది అతడు 10 మిలియన్ల డాలర్లు సంపాదించాడట. దాంతో డెడ్ సెలబ్రిటీల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. ఇదే జాబితాలొ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తరువాత స్థానాల్లో ఎల్విస్ ప్రెస్లీ, ఛార్లెస్ ష్కల్జ్, బాబ్ మార్లే, మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్, జాన్ లెన్నాన్ లు ఉన్నారు.

More Telugu News