వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయాలని టి.వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ వైసీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వరంగల్ ఉపఎన్నికపై చర్చించారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదని పొంగులేటి భేటీ అనంతరం అన్నారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్న పొంగులేటి, విజయం తమదేనని ధీమాగా తెలిపారు.