నేనే చూసుకుంటానంటూ, స్వయంగా సూర్యప్రభ వాహనమెక్కిన రమణ దీక్షితులు
తిరుమల శ్రీవెంకటేశ్వరుడి వాహన సేవలు అర్చకుల్లో వివాదాలను పెంచగా, ఈ ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరుగుతున్న వేళ, వాహనంపై ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్వయంగా హారతులిస్తూ, స్వామివారి పక్కనే నిలబడ్డారు. సాధారణంగా ప్రధానార్చక హోదాలో వాహన సేవలు ప్రారంభమయ్యే వరకూ ఉండి, ఆపై దేవాలయంలోకి వెళ్లి నైవేద్యాది కైంకర్యాలను పర్యవేక్షించే రమణ దీక్షితులు నేడు వాహనంపై కనిపించడం భక్తుల్లో ఆసక్తిని పెంచింది. అంతకుముందు ఎవరు సూర్యప్రభ వాహనం ఎక్కాలన్న విషయమై వాగ్వాదం జరుగగా, తానే స్వయంగా చూసుకుంటానని వెల్లడించిన రమణ దీక్షితులు మాడ వీధుల ఊరేగింపు బాధ్యతలు స్వీకరించారు. ఏడు గుర్రాల రథంతో కూడిన సూర్య దేవునిపై కొలువైన దేవదేవుడుని చూసేందుకు నయనానందకరంగా ఉంది.