బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్ యువరాజు
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దాంట్లో భాగంగా బీజేపీపై విమర్శల దాడికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ళ పాలనలో, బీజేపీ కర్ణాటక రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ఈరోజు రాహుల్ సింధనూరు జిల్లాలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలవడం కల్ల అని రాహుల్ సెలవిచ్చారు. బీజేపీ పరాభవం విషయం, అప్పుడే, ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.