కళ్లు చూసి ఎవరు ఎలాంటివారో చెప్పొచ్చు... ఎలాగంటే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కళ్లు చూసి ఎవరు ఎలాంటివారో చెప్పొచ్చు... ఎలాగంటే!

మీ కళ్ల రంగు మీ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది. ఇదే సమయంలో ఎదుటి వారి కళ్లను చూసి వారు ఎలాంటి వారో ఇట్టే పట్టేయొచ్చని స్పిరిచ్యువల్ హీలర్ మధు కోటియా చెబుతున్నారు. కళ్ల రంగులను అనుసరించి ఎవరెలా ఉంటారంటే...

నల్ల రంగులో ఉండే కళ్లు

ఈ రంగు కళ్లను రహస్యాన్ని సూచిస్తాయి. వారి వద్ద ఏదో విషయం ఉందని భావించవచ్చు. వీరు అత్యధికులను నమ్ముతారు. ఒకరి రహస్యాలను మరొకరితో పంచుకోరు. ఎక్కువగా కష్టపడే లక్షణాన్ని కలిగివుంటారు. తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వీరికి బాగా తెలుసు.

గోధుమ రంగు కళ్లు

వీరు ఆకర్షణీయంగా ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని, క్రియేటివిటీనీ ఎక్కువగా చూపుతారు. ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు.

లేత గోధుమ రంగులో కళ్లు

పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇతరులకు వినోదాన్ని కలిగించాలని భావిస్తారు. సాహసాలు చేయడం వీరికి ఇష్టం. వీరు ఎదుటివారిని వెంటనే ఆకర్షించినప్పటికీ, ఆ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగించడంలో విఫలమవుతారు.

బూడిద రంగు కళ్లు

వీరిలో హుందాతనం మూర్తీభవించి వుంటుంది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. చేయాలనుకున్నదాన్ని చేసుకుంటూ వెళ్లిపోయే రకం. ప్రేమ, రొమాన్స్ తదితరాలకు ఎక్కువ విలువనిస్తారు. మానసికంగా బలంగా ఉంటూ, పరిస్థితులను విశ్లేషించి కష్టకాలం నుంచి నెట్టుకు వచ్చేస్తారు.

పచ్చ రంగు కళ్లు

తెలివితేటలు వీరి సొంతం. జీవితాంతం కొత్త విషయాల పట్ల ఆసక్తిని చూపుతారు. చేసే పనిని ఆనందిస్తూ చేస్తారు. త్వరగా అసూయపడే స్వభావం వీరికున్న అవలక్షణం.

నీలి రంగు కళ్లు

శాంతంగా, స్మార్ట్ గా ఉంటూ ఇతరులను ఆకర్షిస్తారు. వారితో దీర్ఘకాల బంధాన్ని కొనసాగిస్తారు. నిజాయతీతో ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచేందుకు కృషి చేస్తారు. చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా గమనిస్తుంటారు.

More Telugu News