వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడని ఆరోపిస్తూ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ పై ఓ యువతి హైదరాబాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మదిపాడు అగ్రహారం మండలం గింజుపల్లి గ్రామానికి చెందిన వల్లపునేని కృష్ణారావు (27) సినీ సహాయ దర్శకుడుగా పనిచేస్తూ, ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఓ ఈవెంట్ లో పరిచయమైన రోజా అనే అమ్మాయితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటానంటూ ఏడాది కాలంగా కృష్ణానగర్ లో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది.
డ్రగ్స్ కు అలవాటు పడి, రోజాకు కూడా డ్రగ్స్ ఇచ్చి, దారుణంగా హింసించేవాడు. సిగిరెట్లతో కాల్చేవాడు. పీకల్దాక మద్యం తాగి, పళ్లతో కొరికేవాడు. మూడు రోజుల క్రితం రోజా నగలు, లక్ష రూపాయల నగదును తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన నుంచి దోచుకున్న డబ్బుతో నలుగురు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగించాడని ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, కృష్ణారావు కోసం గాలింపు చేపట్టారు.
More Telugu News
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!