Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరగా హైకోర్టు విభజించేలా చూడండి... గవర్నర్ కు టీఆర్ఎస్ ఎంపీల వినతి

హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేరువేరుగా హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలని గవర్నర్ ను కోరారు. ఈ విషయాన్ని సత్వరమే కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకునేలా వివరించాలని ఎంపీలు నరసింహన్ ను కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. గవర్నర్ ను కలసిన వారిలో కేకే, వినోద్ కుమార్, కవిత తదితరులు ఉన్నారు.

More Telugu News