Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాంలీలా మైదాన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న అన్నాహజారే

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో అక్టోబర్ 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, ఒకే ర్యాంకు-ఒకే పింఛను అమలుపై ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. భూ సేకరణ బిల్లులో ముఖ్యమైన నిబంధన రైతుల అనుమతితో భూములు సేకరించాలనే దానిని సవరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్లాజును బిల్లులో చేర్చి, రైతుల అనుమతితోనే భూసేకరణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, యూపీఏ అధికారంలో ఉండగా జన లోక్ పాల్ బిల్లు కోసం హజారే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష సందర్భంగా అన్నాకు మద్దతిచ్చిన కేజ్రీవాల్ సొంత పార్టీ స్థాపించగా, కిరణ్ బేడీ బీజేపీలో చేరారు.

More Telugu News