అమిత్ షాకు ఏ విషయంపైనా అవగాహన లేకపోవడం ప్రమాదకరం: నితీష్ కుమార్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సెటైర్లు వేశారు. దేశానికి తొలి బీసీ ప్రధాని నరేంద్ర మోదీ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తొలి బీసీ ప్రధాని మోదీ కాదని, దేవెగౌడ అని అన్నారు. అమిత్ షాకు ఏదీ పూర్తిగా తెలియకపోవడం, దేనిపైనా పూర్తి అవగాహన లేకపోవడం ప్రమాదకరమని చురకలంటించారు. అయినా, అమిత్ షా వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదని... అధికారం కోసం బీజేపీ నేతలు ఏం చేయడానికైనా సిద్ధమవుతారని విమర్శించారు.