Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో రూ. 3 లకే భోజనం... పేదలకు కేజ్రీవాల్ కానుక!

దేశ రాజధాని ఢిల్లీలో నిరుపేదల కడుపు నిండనుంది. ఈ మేరకు రూ. 3 నుంచి రూ. 5కే భోజనం లభ్యమయ్యే విధంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఢిల్లీ డైలాగ్ కమిషన్ ఈ తరహా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించిందని తెలుస్తోంది. కాగా, గతంలో ఇదే తరహా పథకాన్ని కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 'జన్ ఆహార్' పథకం ప్రారంభించి ఆరు పూరీలు, కూర, పప్పులను రూ. 18కి అందిస్తున్న 30 కేంద్రాలు ఢిల్లీలో నడుస్తున్నాయి. ఈ కొత్త పథకంతో 'జన్ ఆహార్' పథకం మూలనపడే అవకాశాలు ఉన్నాయి. తమిళనాట నడుపుతున్న 'అమ్మ క్యాంటీన్ల' గురించి అధ్యయనం చేసిన ఢిల్లీ సర్కారు అవే తరహాలో క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

More Telugu News