నన్ను తాకడం ద్వారా 34 వేల మంది పిల్లలను ఆశీర్వదించండి: పోప్ ను కోరిన నన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను తాకడం ద్వారా 34 వేల మంది పిల్లలను ఆశీర్వదించండి: పోప్ ను కోరిన నన్

రోమన్ క్యాథలిక్కుల్లో నన్ ల సేవలు ప్రత్యేకమైనవి. దైవ ప్రచారం చేయడం కన్నా మానవ సేవే పరమావధిగా విధులు నిర్వర్తిస్తారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆసుపత్రులు నిర్వహిస్తూ మెరుగైన వైద్యం అందిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివాస ప్రాంతాలనే ఆసుపత్రులుగా మార్చి సేవలు అందిస్తారు. అవసరమైన వారికి ఉచిత విద్యను కూడా అందిస్తారు. ఇటలీకి చెందిన మేరియా కాన్ కెట్టా (81) నన్ గా ఆఫ్రికాలోని దీఆర్ కాంగోలో గత 50 ఏళ్ల నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ 50 ఏళ్లలో ఆమె సుమారు 34 వేల మంది గర్భవతులకు ప్రసవం చేశారు. ఆమె పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. ఈ సందర్భంగా తన చేతులను స్పృశించాలని ఆమె పోప్ ను కోరారు. అలా చేయడం ద్వారా 34 వేల మంది పిల్లలను ఆశీర్వదించినట్టవుతుందని ఆమె పేర్కొన్నారు. నిరాడంబరతకు పెద్దపీట వేసే పోప్ ఫ్రాన్సిస్, అంత గొప్ప పని చేసిన ఆమె చేతులను ఆప్యాయంగా తాకారట. 8 పదుల వయసు దాటినా ఆమె ఇప్పటికీ విధుల్లో పాలుపంచుకోవడం విశేషం. మదర్ థెరెస్సా కూడా ఇలాంటి నన్ గానే భారత్ లో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు.

More Telugu News