మోదీ 'భేటీ బచావో'కు మలాలా ఫోటో
'భేటీ బచావో' కార్యక్రమానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. దేశ విదేశాలనుంచి ప్రధాని అకౌంట్ కు ఫోటోలు పంపుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ 'న్యూయార్క్ టైమ్స్' భేటీ బచావో కార్యక్రమంపై ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అభిమానం వెల్లువెత్తుతోంది. భేటీ బచావోకు పలువురు తమ కుమార్తెలతో దిగిన ఫోటోలు పంపుతూ, ఆడపిల్ల తమకెంత మక్కువో చాటి చెబుతున్నారు. తాజాగా, పాకిస్థాన్ కు చెందిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ సైతం భేటీ బచావో కార్యక్రమానికి మద్దతు పలుకుతూ, తన తండ్రితో దిగిన ఫోటోను పంపింది.