Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంచు కొండల మధ్య క్లిష్టమైన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన హోం మంత్రి రాజ్ నాథ్

భువిపై ఏర్పడే అద్భుతంగా, పరమశివుడు స్వయంగా మంచు రూపంలో అవతరించి భక్తులకు దర్శనమిస్తాడని హిందువులు నమ్మి, వ్యయప్రయాసలకు ఓర్చి చేసే అమర్ నాథ్ తీర్థయాత్ర ఈ ఉదయం జమ్మూలో ప్రారంభమైంది. తొలి విడతలో 1100 మంది భక్తులు బల్తాల్ మార్గం ద్వారా ఈ యాత్రకు బయలుదేరారు. ఈ బృందంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కూడా ఉన్నారు. స్వయంగా హోం మంత్రే యాత్రకు బయలుదేరడంతో ఈ మార్గంలో అదనంగా సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. తొలి బృందం యాత్రను శ్రీనగర్ ప్రభుత్వ అధికారులు జెండా వూపి ప్రారంభించారు.

More Telugu News