టి.సచివాలయంలో సెటిలర్ల కోసం ఓ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలి: సెటిలర్స్ ఫోరం కన్వీనర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టి.సచివాలయంలో సెటిలర్ల కోసం ఓ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలి: సెటిలర్స్ ఫోరం కన్వీనర్

విభజన చట్టంలో ఉన్న సెక్షన్-8 అవసరమేనని... అయితే, దాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ కొరవడిందంటూ ఏపీ పాలకులు వివాదం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అయితే, సెటిలర్స్ కోసం తెలంగాణ సచివాలయంలో ఓ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక హైదరాబాద్ విలువ మరింత పెరిగిందని అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు.

More Telugu News