బాలయ్య ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన... ఒక్కరోజే 1,300 అర్జీలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్య ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన... ఒక్కరోజే 1,300 అర్జీలు!

టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్ కు వినతులు పోటెత్తాయి. హిందూపురం మునిసిపాలిటీలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి బాలయ్య నిర్వహించిన ప్రజా దర్బార్ కు పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలయ్య కూడా ఓపికగా ప్రజలందరి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారంపై అక్కడికక్కడే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. బాలయ్య ప్రజా దర్బార్ విజయవంతమైన నేపథ్యంలో, ఆయన స్వీకరించిన అర్జీల సంఖ్య ఎంతన్న విషయంపై నిన్న రాత్రి దాకా ఆసక్తికర చర్చ సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాటే దాకా ప్రజా దర్బార్ నిర్వహించిన బాలయ్య, ఏకంగా 1,300 అర్జీలు స్వీకరించారట. నేడు హిందూపురం రూరల్ ప్రాంతంలో బాలయ్య ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయన ఎన్ని అర్జీలను స్వీకరిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

More Telugu News