జులై 25న ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్ష నిర్వహిస్తాం: సీబీఎస్ఈ
ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) ను జులై 25న నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మేలో నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టులోగా పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని పేర్కొంది. దాంతో మరోసారి పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్తోంది.