'సెక్షన్ 8'పై మేం ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ కూడా అదే చెప్పారు: ఏపీ హోంమంత్రి చినరాజప్ప
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సెక్షన్ 8'పై మేం ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ కూడా అదే చెప్పారు: ఏపీ హోంమంత్రి చినరాజప్ప

సెక్షన్ 8 అమలుపై తాము ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా అదే చెప్పారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఇకనైనా గవర్నర్ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సరైన సమయంలో అన్ని ఆధారాలు బయటికి వస్తాయని రాజప్ప అన్నారు. ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్న సంగతి సీఎం కేసీఆర్ గ్రహించాలని ఆయన సూచించారు.

More Telugu News