రాత్రి పూట ఉపవాసముంటే మంచి నిద్ర వస్తుందట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాత్రి పూట ఉపవాసముంటే మంచి నిద్ర వస్తుందట

రాత్రి పూట డిన్నర్ చేయకుండా నిద్రకు ఉపక్రమిస్తే, మధ్య రాత్రిలో ఆకలేస్తుంది. ఒకసారి మేలుకొంటే, మళ్లీ నిద్రపట్టదన్నది చాలా మంది అభిప్రాయం. దీన్ని తప్పని తేల్చింది న్యూయార్క్ పరిశోధకుల తాజా అధ్యయనం. రాత్రి పూట చేసే ఉపవాసంతో మంచి నిద్ర వస్తుందని, ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చవుతాయని, అధ్యయనంలో ప్రధాన భూమిక వహించిన డేవిడ్ వివరించారు. ఇందులో భాగంగా 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 44 మందిని పరిశీలించినట్టు వివరించారు. వీరిని పరీక్షిస్తున్న సమయంలో కొంత కాలం కడుపునిండా ఆహారం, పానీయాలు ఇచ్చామని, ఆపై మరికొన్ని రోజులు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా నీరు మాత్రమే ఇచ్చి, వీరు ఎలా నిద్రపోతున్నారన్న విషయాన్ని పరిశీలించి అధ్యయనాన్ని రూపొందించామని తెలిపారు. కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే, ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు తేలిందన్నారు. రాత్రి సమయాల్లో మితాహారమే మేలని, ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమితో పాటు ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడతాయని తెలియజేశారు.

More Telugu News