ఓ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ మామిడి కాయలు కోసుకు తింటాడోనని, ఏకంగా 24 మందిని కాపలా పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. జితన్ రాం మాంఝీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాట్నాలోని 1, అన్నేమార్గ్ బంగ్లాలో అధికారికంగా నివాసం ఉండేవారు. ఆయన పదవి నుంచి దిగిపోయినా, ఆ భవంతిని మాత్రం ఖాళీ చెయ్యలేదు. ఆ భవనం ప్రాంగణంలో ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయి. ఈ సీజనులో ఈ చెట్లు మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ మామిడి మంచి రుచిగా ఉండటంతో బీహార్ రాజకీయ నేతలు తమకు కాయలు కావాలని సిఫార్సులు చేస్తుంటారు. మాంఝీ, ఆయన అనుయాయులు ఎక్కడ కాయలు కోసేస్తారోనని 8 మంది ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుళ్లు రేయింబవళ్లు ఆ చెట్లకు కాపలా కాస్తున్నారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఇంట పోలీసులను కాపలా పెట్టడంపై మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవ్వామ్ మోర్చా పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇది ఓ దళిత నేతను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. తన ఇంటికి ఎందరో పేదలు నిత్యమూ వస్తుంటారని, వారికి కనీసం మామిడి కాయలు తినేందుకు కూడా అర్హత లేదని నితీష్ ప్రభుత్వం భావిస్తోందని మాంఝీ విమర్శించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన