ఈ-కామర్స్ రంగంలో వచ్చిన బూమ్ తో ఈ ఏడాది కొత్త కొలువుల పంట పండనుంది. కనీసం 6 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని, వేతనాల్లో 20 శాతానికి పైగా పెరుగుదల నమోదు కానుందని ప్లేస్ మెంట్ కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంలో భాగంగా కార్పొరేట్ కంపెనీలు మానవ వనరుల సేవలందిస్తున్న సంస్థల చుట్టూ తిరుగుతున్నాయి. గత సంవత్సరం తాము 85 వేల మందికి ప్లేస్ మెంట్ చూపించినట్టు ఇండియా స్టాఫింగ్ ఫెడరేషన్ చైర్ పర్సన్, టీమ్-లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణా చక్రవర్తి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 16 వేల మందికి ఉపాధి చూపినట్టు తెలిపారు.
ఈ-కామర్స్ విభాగంతో పాటు రిటైల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో కొత్త ఉద్యోగుల కోసం డిమాండ్ అధికంగా ఉంటోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు రూ. 10,500 వేతనముండగా, సీనియర్ పోస్టులకు నెలకు రూ. 2 లక్షల వరకూ ఆఫర్ వస్తోందని తెలిపారు. ఇండియాలో గడచిన దశాబ్ద కాలంలో వివిధ రంగాల్లో 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2014లో మాత్రం టెంపరరీ ఉద్యోగాల వృద్ధి 8 శాతానికి మాత్రమే పరిమితమైంది. తిరిగి ఈ సంవత్సరం గణనీయంగా పుంజుకుంది. తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ సమీప భవిష్యత్తులో 25 నుంచి 30 శాతం పెరగనుందని హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్ స్టాడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తి కే ఉప్పలూరి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఎంపికయ్యేవారికి మంచి వేతన ఆఫర్లు రానున్నాయని మాన్ పవర్ గ్రూప్ ఇండియా ఈడీ శ్రీకాంత్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన