ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలికకు ఆపరేషన్ నిర్వహించిన ఎయిమ్స్ వైద్యుడు 'రెండు కిడ్నీలు ఏమయ్యాయో తనకు సంబంధం లేద'న్న ఘటనపై కేంద్రం స్పందించింది. గత వారం యూపీలోని రాయ్ బరేలీకి చెందిన పవన్ కుమార్ కుమార్తె దీపికను (6) కిడ్నీ సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. అక్కడ పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని తెలిపారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీ తొలిగిస్తామని చెప్పారు. ఎడమ కిడ్నీ తొలగించే క్రమంలోనే గత మార్చి 17న పిడియాట్రిక్ విభాగంలోని సీనియర్ సర్జన్ శస్త్రచికిత్స నిర్వహించారు.
ఆ తరువాత కూడా బాలికకు అదే సమస్య ఎదురు కావడంతో, స్థానిక వైద్యులను సంప్రదించగా, పరీక్షలకు సిఫారసు చేశారు. ఆ వైద్య పరీక్షల్లో ఆమె రెండు కిడ్నీలు కనబడలేదు. దీంతో దీపిక తల్లిదండ్రులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ సర్జన్ ను నిలదీశారు. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే కిడ్నీ, దానిని నేను తీసేశా, అసలు పాపకి రెండు కిడ్నీలు లేనేలేవు' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కధనం జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విచారణకు ఆదేశించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన