భారత్ లో భోజన ప్రియులు ఎక్కువ. రాష్ట్రానికో సంప్రదాయ ఆహారం భారత్ లో లభ్యమవుతుంది. పోషక విలువలు, అమోఘమైన రుచులు భారత్ ఆహారం సొంతం. అయినప్పటికీ మనకి పాశ్చాత్య ఆహారం అంటే తగని మక్కువ. అందుకే ఏ రెస్టారెంట్ కెళ్లినా, చైనీస్, ఇటాలియన్, జపనీస్, థాయ్, ఎడారి దేశాల తందూరీలే ప్రముఖంగా కనిపిస్తాయి. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఢిల్లీ జంక్ ఫుడ్ ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు బార్ సెలోస్ అనే అంతర్జాతీయ బర్గర్ల సంస్థ అవుట్ లెట్ ప్రారంభించింది.
యూఎస్, జపాన్ లో ఎన్నో అవుట్ లెట్లతో నడుస్తున్న ఈ సంస్థ, భారత్ లో తొలి బ్లాక్ బర్గర్ అవుట్ లెట్ ను ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో ప్రారంభించింది. ఇందులో రెండు రకాలైన్ బ్లాక్ బర్గర్లు లభిస్తాయని వారు తెలిపారు. బ్లాక్ బర్గర్ మామూలు బర్గర్ లాంటిది కాదని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని అవుట్ లెట్ నిర్వాహకులు తెలిపారు. బ్లాక్ బ్యూటీ (155 రూపాయలు) వెజ్ బర్గర్, పెర్రీ బ్లాక్ మ్యాజిక్ (195 రూపాయలు) నాన్ వెజ్ బర్గర్లు భోజన ప్రియులకు అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. సాధారణ బర్గర్లు తినితినీ బోర్ కొట్టిన వారు, ఛేంజ్ కోరుకునే వారు ఢిల్లీ వెళ్లినప్పుడు ఖాన్ మార్కెట్ లో ఉన్న ఈ అవుట్ లెట్ సందర్శించి రుచి చూడచ్చు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన