ఏపీలో ముగిసిన ఆర్టీసీ సమ్మె... విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో ముగిసిన ఆర్టీసీ సమ్మె... విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

గత ఎనిమిది రోజులుగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె ముగిసింది. తాము డిమాండ్ చేసిన 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుందని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని వెల్లడించాయి. దీంతో సమ్మె ముగిసిందని... వెంటనే కార్మికులంతా విధుల్లో చేరాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా, తమ డిమాండ్లకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చర్చలు ఫలవంతమయ్యేలా సహకరించిన మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News