Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సత్తెనపల్లిలో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్... కారణం చెప్పని అధికారులు

విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ రైలు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిలిచిపోయింది. ఐదు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తిండి, నీళ్లు లేక ఇక్కట్లపాలయ్యారు. రైలు ఎందుకు నిలిచిపోయిందన్న దానికి అధికారులు కారణం చెప్పకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తామెప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాలంటూ వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News