నాడు బిల్ క్లింటన్ కు తలపాగా చుట్టిన గజేంద్ర సింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాడు బిల్ క్లింటన్ కు తలపాగా చుట్టిన గజేంద్ర సింగ్!

గజేంద్ర సింగ్... ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగ సభ జరుగుతుంటే, చెట్టెక్కి ఆత్మహత్య చేసుకున్న రైతుగా ఇప్పుడు దేశమంతటికీ తెలుసు. ఈ ఘటనపై పార్లమెంట్ సైతం అట్టుడుకుతోంది. అయితే, గజేంద్ర సింగ్ తలపాగా చుట్టడంలో బహు నేర్పరి అని, 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు తలపాగా చుట్టింది గజేంద్రే అని ఎంతమందికి తెలుసు? అప్పట్లో రాజస్థాన్, జైపూర్ జిల్లాలోని నైలా గ్రామానికి వచ్చిన క్లింటన్ కు గజేంద్ర దగ్గరుండి తలపాగా చుట్టి వార్తల్లోకెక్కాడు కూడా. తలపాగా చుట్టడంలో తన నేర్పరితనాన్ని చూపి పలు పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులను కూడా ఆయన పొందాడు. వివాహాది శుభకార్యాలకు, మత కార్యక్రమాలకు, ప్రముఖులు వచ్చినప్పుడు వారికి తలపాగా చుట్టే బాధ్యతను గజేంద్రకే అప్పగించే వారట. గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి, రాజ్ నాథ్ సింగ్ తదితర ప్రముఖులకు గజేంద్ర తలపాగాను అలంకరించాడు కూడా. అటువంటి వ్యక్తి అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవడం పాలకుల చేతగానితనానికి నిజంగా నిదర్శనం.

More Telugu News