ఏపీ మంత్రి దేవినేని ఉమ ఇంట్లో మిస్ ఫైర్... తప్పిన ముప్పు
ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటిలో నేటి ఉదయం మిస్ ఫైర్ చోటుచేసుకుంది. ఉదయం ప్రశాంతంగా ఉన్న ఆయన ఇంటిలో తుపాకీ మోత వినిపించడంతో కలకలం రేగింది. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని దేవినేని ఉమ ఇంటిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీను నాయక్ చేతిలో తుపాకీ పేలింది. తుపాకీని శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారిగా అది పేలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.