అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి

యూఎస్ లో మరో భారత కిరణం మెరిసింది. చెన్నైకి చెందిన రాజరాజేశ్వరి న్యూయార్క్ లోని క్రిమినల్ కోర్టు జడ్జిగా నామినేట్ అయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. తన 16 ఏళ్ల ప్రాయంలో అమెరికా వెళ్ళిన ఆమె, న్యాయవిద్య అనంతరం 16 సంవత్సరాలుగా రిచమండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా విధులు నిర్వహిస్తున్నారు. న్యాయశాస్త్రంతో పాటు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన తల్లి పద్మారామనాథన్ పేరిట ప్రారంభించిన డాన్స్ అకాడమీ తరపున అప్పుడప్పుడూ ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, తన కల నిజమైందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

More Telugu News