ఇక సిగ్గుతో చావాల్సిందే... కామాంధుల పేర్లు, చిత్రాలతో ఆన్ లైన్ డేటా బేస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక సిగ్గుతో చావాల్సిందే... కామాంధుల పేర్లు, చిత్రాలతో ఆన్ లైన్ డేటా బేస్

చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు, వేధింపులు అడ్డుకొనే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. చిన్నారులపై లైంగిక కేసులను ఎదుర్కొంటున్న వారి పేర్లు, చిత్రాలతో కూడిన ఆన్ లైన్ డేటా బేస్ నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకోసం మేనకా గాంధీ నేతృత్వంలోని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర హోం శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా చిన్నారులను వేధింపులకు గురిచేసిన వారి వివరాలు వెల్లడించడం ద్వారా వారు సిగ్గుపడి బుద్ధి తెచ్చుకోవాలన్నది తమ అభిమతమని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందించామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ తరహా డేటా బేస్ నిర్వహిస్తున్నాయి.

More Telugu News