మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి. ఈరోజు మళ్లీ పెరిగాయి. బంగారం ధర రూ.240 పెరగడంతో... పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. నెల రోజుల్లో ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. అదే క్రమంలో వెండి ఏకంగా రూ.900 పెరిగింది. దాంతో కిలో వెండి ధర రూ.38,500కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరగడంతో డిమాండు పెరుగుతోందని, అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News