మీరట్ లో విషాదం... అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురి సజీవ దహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరట్ లో విషాదం... అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురి సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఇంటిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. నేటి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోగానే ప్రమాదం సంభవించిన ఇంటిలోని ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు.

More Telugu News