ఏపీకి 1616 కోట్లు, తెలంగాణకి 915 కోట్లు విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీకి 1616 కోట్లు, తెలంగాణకి 915 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసింది. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వాటాను కేంద్రం తొలివారంలోనే విడుదల చేయడం విశేషం. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామి అవుతుందని పేర్కొన్న విధంగా మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన తొలి విడత పన్నుల వాటాను విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు 37,420 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండు తెలుగు రాష్ట్రాలకు 2,531 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటా 1616 కోట్లుగా పేర్కొన్న కేంద్రం, 915 కోట్ల రూపాయలను తెలంగాణ పన్నుల వాటాగా నిర్ణయించింది. కాగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

More Telugu News