ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కుప్పకూలిన జర్మన్ వింగ్స్ విమాన శకలాలు, మృతదేహాలు తీసుకువచ్చేందుకు సహాయకచర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా, సహాయకచర్యలకు కొంతసేపు అంతరాయం కలిగింది. విమానం కూలిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడంతో వందల మీటర్లమేర విమాన శకలాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని సహాయక బృందాలు తెలిపాయి. కాక్ పిట్ వాయిస్ ను స్వాధీనం చేసుకున్న సహాయక బృందాలు దానిని పారిస్ తరలించాయి. సీవీఆర్ చాలావరకు దెబ్బతిందని, అయితే డేటా సేకరించడం కష్టం కాదని ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలిపాయి.
38వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానం కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆరువేల అడుగుల ఎత్తుకు ఎందుకు పడిపోయింది? అనేది తెలియాల్సి ఉంది. విమానం కిందికి వస్తున్నప్పుడు పొగలు రాలేదని, విస్పోటనం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీవీఆర్ రికార్డర్ లభ్యమైనప్పటికీ, ఫ్లైట్ డేటా రికార్డర్ దొరకలేదని, అది దొరికితే కానీ విమాన ప్రమాదంపై ఓ అంచనాకు రాలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగే ముందు పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, దానిని అవలాంచి(మంచు తుపాను)గా భావించామని స్థానికులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశంలో పర్వతాల ఎత్తు మూడు వేల అడుగులని, అందువల్ల సుశిక్షుతులైన సహాయక బృందాలను రంగంలోకి దించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన