దక్షిణ ఫ్రాన్స్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో విమానంలో 142 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎయిర్ బస్ ఏ320 విమానం జర్మన్ వింగ్స్ సంస్థకు చెందినది. బార్సిలోనా నుంచి డస్సెల్ డార్ఫ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డిగ్నే అనే ప్రాంతంలోని ఫ్రెంచ్ ఆల్ఫ్స్ దగ్గర ఈ విమానం క్రాష్ అయిందని అధికారులు ధ్రువీకరించారు.