సాధారణంగా చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. అలాగే, ప్రతిక్షణం కళ్ల ముందు కదలాడే పెద్దలను అచ్చుగుద్దినట్టు అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, డన్నా గోమెజ్ అనే ఐదేళ్ల కొలంబియా చిచ్చరపిడుగు మేకప్ పై ముఖం తిప్పుకోలేని చిట్కాలు చెబుతోంది. డన్నా గోమెజ్ కొలంబియన్ ప్రైమరీ స్కూల్ లో చదువుతోంది. ఈ ఐదేళ్ల గడుగ్గాయి మేకప్ ఎలా చేసుకోవాలి? ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి? మస్కారా, ఐలైనర్ ఎలా వేసుకోవాలి? మేకప్ ఎలా చేసుకుంటే బాగుంటుంది? అంటూ స్పానిష్ భాషలో చెప్పిన చిట్కాలకు ముగ్ధులైన రెండు కోట్ల మంది, సామాజిక వెబ్ సైట్లలో బాలిక మేకప్ పాఠాన్ని ఇష్టపడ్డారట.
ఈ వీడియోను కోటీ యాభై లక్షల మంది షేర్ చేసుకోవడం విశేషం. పెద్ద ఆరిందాలా చెబుతున్న మేకప్ పాఠాన్ని బాలిక బంధువు (ఆంటీ) డెనిస్సీ చిత్రీకరించి ఇంటర్నెట్ లో ఆప్ లోడ్ చేసింది. చిన్న బాలిక ముచ్చటగా చెబుతున్న మేకప్ కిటుకులను పెద్దలంతా ఆశ్చర్యపడి చూస్తుండగా, బుద్ధిగా చదువుకోకుండా అప్పుడే ఈ మేకప్ గోల ఏంటి? అంటూ విమర్శించేవారు కూడా ఉన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన