నవ్యాంధ్ర రాజధాని పేరు 'అమరావతి'!
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి 'అమరావతి' అనే పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం. త్వరలోనే అధికారికంగా అమరావతి పేరును ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. విదేశీ నగరాలతో పోటీపడేలా కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాల మధ్య తుళ్ళూరు ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేశారు. చారిత్రక ప్రాధాన్యమున్న పేరు కాబట్టే రాజధానికి అమరావతి అని పేరు పెట్టినట్టు సమాచారం.