రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాదు... కేసీఆర్ బంగారు తెలంగాణ వ్యాఖ్యలపై రేవంత్!

23-03-2015 Mon 08:29 | Telangana
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్ తో బంగారు తెలంగాణ కాదు కదా, రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాదు’’ అంటూ ఆయన నిన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదిలాబాదు జిల్లా కాగజ్ నగర్ లోని ఎస్పీఎం మిల్లును తెరవాలని కార్మికులు చేస్తున్న దీక్షలకు రేవంత్ రెడ్డి నిన్న సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘బంగారు తెలంగాణ తెస్తారన్న కొండంత ఆశతో ప్రజలు కేసీఆర్ కు ఓటేశారు. అయితే ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. ఎస్పీఎం మిల్లుకు రూ.100 కోట్లిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్కారు మెడలు వంచైనా మిల్లును తెరిపిస్తాం’’ అని ఆయన అన్నారు. ఇటీవల మరణించిన మిల్లు కార్మికుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more