బాబు 'రియల్' వ్యాపారానికి నారాయణ కలెక్షన్ ఏజెంట్: కాంగ్రెస్ ఘాటు విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే, మంత్రి నారాయణ కలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆనం వివేకానంద రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ ఉదయం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటున్న ఆయన ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నవ్యాంధ్రను శూన్యంధ్రగా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. 9 నెలల పాలనలో 9 వాగ్దానాలకు చరమగీతం పాడారని ఆనం అన్నారు.