మెల్బోర్న్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఓపెనర్లు బౌండరీలపై కన్నేశారు. ఒక వైపు రోహిత్ శర్మ, మరో వైపు శిఖర్ ధావన్ లు వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతున్నారు. దీంతో పరుగులు వేగంగా వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 27 పరుగులు. రోహిత్ 3 ఫోర్లు, ధావన్ 1 ఫోర్ కొట్టారు. శర్మ 15, ధావన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.