కుటుంబ అవసరాల కోసం తీసుకున్న అప్పును భర్త తీర్చలేదట. అందుకని ఆ ఇంటి ఇల్లాలిని వడ్డీ వ్యాపారులు నిర్బంధించారు. చిన్నారి పాప సహా ఆమెను గంటల తరబడి తమ అధీనంలో ఉంచుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... నర్సాపూర్ కు చెందిన మల్లేశం, సునీత దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాదుకు వలస వెళ్లారు. ఏడాదిన్నర క్రితం అత్యవసరమై నర్సాపూర్ లోని వడ్డీ వ్యాపారుల వద్ద మల్లేశం రూ. 20 వేలు అప్పు తీసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటిదాకా ఆ అప్పును మల్లేశం తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో నిన్న నర్సాపూర్ వచ్చిన సునీతను వడ్డీ వ్యాపారులు నిర్బంధించారు. తమ ఇంటికి ఆమెను తీసుకెళ్లి, రోడ్డుపై కోర్చోబెట్టారు. నీ భర్త బాకీ తీర్చే దాకా నిన్ను వదిలిపెట్టేది లేదంటూ ఆ కసాయి వ్యాపారులు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక చిన్నారి కూతురితో కలిసి ఆమె బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది. విషయం తెలిసి అక్కడికెళ్లిన మీడియాను ‘‘అప్పు మీరు తీరుస్తారా?’’ అంటూ సదరు వ్యాపారి ప్రశ్నించాడు. ఎట్టకేలకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సునీతను బందీఖానా నుంచి విడిపించారు. ఆమెను నిర్బంధించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన