కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్న సోదరుడు ప్రహ్లాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి కరవైందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన 'ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ ఫెడరేషన్' కార్యక్రమంలో దానికి ఉపాధ్యక్షుడైన ప్రహ్లాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాలని మీరు (ప్రజలు) కష్టపడ్డారు. కానీ, ఇప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే, ఇదంతా ఎన్ డీఏ ప్రభుత్వ వైఫల్యమని నేననుకుంటున్నా" అని మోదీ సోదరుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో మోదీ గురించి ప్రస్తావిస్తూ, "నేను చేస్తున్న వ్యతిరేకత ఒక సోదరుడిపై మరో సోదరుడు చేస్తుంది కాదు. నా సోదరుడు చాలా విలువైన వ్యక్తి. తనని గౌరవిస్తా. కానీ నేనో వృత్తిలో ఉన్నాను కాబట్టి, ఈ ప్లాట్ ఫామ్ కు వచ్చి సోదరుడి ముందు నా గొంతు విప్పుతున్నా" అని ప్రహ్లాద్ వివరించారు. కాగా, దేశంలో అవినీతి అంశంపై మాట్లాడిన ఆయన, అవినీతిపై పోరాడతామన్న సందేశంతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పుడా అంశాన్ని వీధుల్లోకి తీసుకురావాల్సిన అవసరమొచ్చిందన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన