వరల్డ్ కప్ లో బిజీగా ఉన్న టీమిండియా కెప్టెన్ ధోనీ బైకుల గురించి ఎందుకు మాట్లాడాడా? అని అనుకుంటున్నారా? ప్రపంచకప్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్ ధోనీతో చిన్నపిల్లల ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ చిచ్చరపిడుగు మీకు బైకులంటే ఇష్టం కదా? మీ దగ్గర ఎన్ని బైకులు ఉన్నాయని అడిగాడు. దీనికి ధోనీ సమాధానమిస్తూ, తన దగ్గర 35 బైకులు ఉన్నాయని అన్నాడు. వివిధ కంపెనీలకు చెందిన, వివిధ మోడళ్ల బైకులు ఉన్నాయని అన్నాడు.
స్పోర్ట్స్ బైకులు తనకు అంతగా సౌకర్యవంతంగా ఉండవని అన్నాడు. వాటన్నింటిలో రాజ్ దూత్ 380 సీసీ కెపాసిటీ బైక్ ఒకటి ఉందని, అదంటే వల్లమాలిన అభిమానం అని ధోనీ తెలిపాడు. దానిపై హెల్మెట్ పెట్టుకుని తిరిగేస్తానని ధోనీ చెప్పాడు. దానిమీద వెళ్తుంటే ఎవడ్రా విచిత్రమైన పాతకాలం బైక్ మీద వెళ్తున్నాడని అనుకుంటారని, అది చేసే పెద్ద శబ్దం కారణంగా అక్కడితో ఆగిపోతారని తెలిపాడు. అదే స్పోర్ట్స్ బైక్ పై వెళ్తే అంతా చూస్తారని, అది తనకు నచ్చదని ధోనీ పేర్కొన్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన