పదేపదే హైకోర్టు విభజన అనకండి... ఎన్నోసార్లు స్పష్టతనిచ్చాం: సదానంద గౌడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హైకోర్టును విభజించాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని అన్నారు. దీంతో, కేంద్ర మంత్రి సదానంద గౌడ కల్పించుకుని పదేపదే హైకోర్టు విభజన గురించి మాట్లాడకండి, దీనిపై ఎన్నోసార్లు స్పష్టత ఇచ్చామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు నిర్వహణకు సరిపడా భవనాన్ని చూపించాలని రాష్ట్రాన్ని కోరామని అన్నారు. దానికి స్పందించి వారు చూపించిన భవనాన్ని అధికారులు పరిశీలించారని, అది సరిపోదని చెప్పారని, రాష్ట్రాన్ని కోరిన విధంగా వనరులు చూపితే హైకోర్టు విభజన పెద్ద విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఎంపీ వినోద్ కూర్చున్నారు.