తలకు గాయం కావడంతో బాధ తగ్గాలని డాక్టరును సంప్రదిస్తే స్టాప్లర్ తో పిన్నులు (కుట్లకు బదులుగా) వేసి ఆ బాధను మరింత పెంచాడో డాక్టరు. వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో నేరుగా తొర్రూరులోని ఎంబీబీఎస్ వైద్యుడు స్వరూప్ కుమార్ వద్దకు వెళ్లింది. ఆమె గాయాన్ని పరిశీలించిన స్వరూప్ కుమార్ స్టాప్లర్ తో పిన్నులు కొట్టాడు. అక్కడే ఉన్న కూరయ్య "అదేంటి డాక్టర్ గారూ, కుట్లు వేయండి" అని అడుగగా, "ఏమీ కాదులే!" అని చెప్పి పంపేశారు.
నొప్పి తగ్గకపోవడంతో ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లింది. పిన్నుల కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందని, గాయాన్ని పరిశీలించిన వైద్యులు తెలిపారు. అనంతరం చికిత్స ప్రారంభించారు. దీనిపై స్వరూప్ కుమార్ ను ప్రశ్నించగా, చాలా మందికి పిన్నులు వేసినా ఎవరికీ ఇన్ఫెక్షన్ రాలేదని చెప్పారు. దీంతో అంతా విస్తుపోయారు. ఎంబీబీఎస్ చదివారా? లేక, డిగ్రీ కొనుక్కున్నారా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన