అసెంబ్లీలో జయను కీర్తించిన రోశయ్య... విపక్షాల మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీలో జయను కీర్తించిన రోశయ్య... విపక్షాల మండిపాటు

తమిళనాడు గవర్నర్ రోశయ్యపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తుతిస్తూ మాట్లాడడమే ప్రతి పక్షాల ఆగ్రహానికి కారణం. గవర్నర్ హోదాలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ, అనేక అంతర్రాష్ట్ర జలవివాదాల్లో జయ వైఖరిని రోశయ్య ప్రశంసించారు. ముళ్లై పెరియార్ డ్యాంకు సంబంధించి సుప్రీం తీర్పు తమిళనాడుకు అనుకూలంగా వచ్చిందంటే అది జయ పోరాట ఫలితమేనని కితాబిచ్చారు. దీంతో, డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ తదితరులు రోశయ్యపై ధ్వజమెత్తారు.

More Telugu News