నేడు భక్తులకే కాదు... జేబుదొంగలకూ పర్వదినమే!
వేకువజామునే శివాలయాల బాటపట్టి శివనామస్మరణతో భక్తులు మైమరిచిపోగా, ఇదే అదనుగా జేబుదొంగలు చెలరేగిపోయారు. రాష్ట్రంలోని పలు శైవక్షేత్రాల్లో భక్తుల డబ్బులు, సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీనిపై భక్తులు లబోదిబోమంటున్నారు. ద్రాక్షారామం ఆలయంలో జేబుదొంగల హస్తలాఘవానికి బలైన కొందరు భక్తులు, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మహాశివరాత్రి భక్తులకే కాదు, చోరులకూ పర్వదినంగా మారిందని తాజా ఘటనలు చాటుతున్నాయి. ఆలయాలన్నీ క్రిక్కిరిసిపోవడంతో ఎవరు దొంగో, ఎవరు భక్తుడో అర్థంకాని పరిస్థితి నెలకొంది.