బంగారంతో పట్టుబడ్డ మహిళలు... శంషాబాద్ విమానాశ్రయంలో ఇది మామూలే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారంతో పట్టుబడ్డ మహిళలు... శంషాబాద్ విమానాశ్రయంలో ఇది మామూలే!

హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడడం సాధారణ విషయమైపోయింది. ఇటీవల కాలంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా దొరికిపోతున్న వ్యక్తుల్లో అనుమతి పత్రాలు లేకుండా బంగారం రవాణా చేస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి 4 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వారి వద్ద బంగారం లభ్యమైంది. దీనిపై వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ నలుగురు మహిళలను పోలీసులకు అప్పగించే అవకాశాలున్నాయి.

More Telugu News