ఒంటరి పోరాటం చేస్తున్న పాక్ కెప్టెన్
అడిలైడ్ ఓవల్ లో భారత్ తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ 63 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా, మిస్బా మాత్రం ఎదురొడ్డి నిలిచాడు. అతడికి మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరవైంది. 42 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 7 వికెట్లకు 200 పరుగులు కాగా, విజయం సాధించాలంటే 48 బంతుల్లో 101 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ప్రస్తుతం మిస్బాకు తోడు యాసిర్ షా (11 బ్యాటింగ్) ఉన్నాడు.