371 డి ప్రకారం తెలంగాణలో ఫీజు రీయంబర్స్ మెంట్: మంత్రి కడియం
తెలంగాణలో 371 డి ప్రకారం కనీసం నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన వారికే ఫీజు రీయంబర్స్ మెంట్ వర్తిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వారం రోజుల్లో దానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు. బోధనారుసుముల మార్గదర్శకాలపై సమావేశమైన ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఉపసంఘం చర్చించింది. ఈ భేటీలో ప్రాథమిక మార్గదర్శకాలను ఉపసంఘం అధికారులు రూపొందించగా, వాటి ఖరారుకు ప్రభుత్వం కొంత సమయం తీసుకోనుంది. ఈ నెల 15న అధికారం మరోసారి సమావేశం కావాలని మంత్రి కడియం నిర్ణయించారు. కేజీ నుంచి పీజీ ఉచితవిద్య అంశంపై వారితో చర్చిస్తారు.