అతనిది ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. అన్న సైంటిస్ట్. తమ్ముడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇలాంటి మంచి కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాదు యువకుడు నడింపల్లి వినయ్ కుమార్ కూడా ఎంబీఏ చేశాడు. ఎల్లో పేజెస్, సత్యం, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల్లో టీమ్ లీడర్ గా మంచి పోజిషన్ లోనే ఉద్యోగం చేశాడు. దేశ పారిశ్రామిక రంగం రూపురేఖలు మార్చేసిన టాటా, అంబానీలను ఆదర్శంగా తీసుకుని మంచి వేతనం ఇస్తున్న ఉద్యోగాలను వదిలేశాడు.
చతుర్ వ్యూహా ఇన్పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కాల్ సెంటర్ ను స్థాపించాడు. ఓ చెన్నై కంపెనీ చూపిన ఆశతో 30 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. రూ.25 లక్షలు వసూలు చేసుకున్న చెన్నై కంపెనీ ప్రాజెక్టు ఇవ్వకుండా ఉడాయించడంతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడు. పెరిగిన అప్పులు, రుణదాతల ఒత్తిళ్ల నేపథ్యంలో విజయవాడ చేరుకున్నాడు.
బయటపడటమెలా? అని ఆలోచించగా చోరీలే మార్గంగా కనిపించాయి. విజయవాడ, రాజమండ్రిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసుల చేతికి చిక్కాడు. రూ.20 లక్షల విలువ చేసే కార్లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా, అంబానీల ఎత్తుకు ఎదగాలన్న తన ఆశయమే తనను దొంగగా చేసిందని అతడు బెజవాడ పోలీసుల వద్ద బావురుమన్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన